Home Page SliderTelangana

ఓఆర్‌ఆర్‌లో కార్ల రేసింగ్.. ఆరుగురి అరెస్ట్

హైదరాబాద్ కోకాపేట వద్ద ఓఆర్‌ఆర్‌లో కారు రేసింగ్ పోటీలు పెట్టుకున్న ఆరుగురు యువకులను అరెస్టు చేశారు పోలీసులు. హుస్సేన్, రాకేష్, నారాయణ, ధనరాజ్, రమణ, మణికంఠ అనే ఆరుగురు యువకులను నార్సింగి పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి కార్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. వీరు బెంజ్, ఆడి లాంటి లగ్జరీ రేసింగ్ కార్లు ఉపయోగించి ఈ రేసులు చేస్తున్నారు. ప్రమాదకరంగా అతి వేగంగా దూసుకుపోతున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు.