బంజారాహిల్స్ లో కారు బీభత్సం..
హైదరాబాద్ లో కారు బీభత్సం సృష్టించింది. ఈ ఉదయం బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద వేగంగా దూసుకొచ్చిన పోర్షే కారు చెట్టు ను ఢీకొట్టింది. ఎయిర్ బెలూన్స్ తెరచుకోవడంతో కారు లో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనలో పార్క్ ప్రహరీ గ్రిల్స్ ధ్వంసంమయింది. అయితే, ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.