బాచుపల్లి లో కారు బీభత్సం
తెలంగాణలోని మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో కారు భీభత్సం సృష్టించింది. గండిమైసమ్మ నుంచి బాచుపల్లి వైపు వెళ్తున్న హుందాయ్ వెర్నా కారు ఓవర్ స్పీడ్ లో ప్రగతి నగర్ లోని దుకాణాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా, ఓ దుకాణం పూర్తిగా ధ్వంసం అయింది. అయితే.. ఆ కారుపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యే స్టిక్కర్, అసెంబ్లీ పాస్ ఉంది.