Home Page SliderNationalSports

కెప్టెన్ Mr. Coolకు బౌలర్లపై కోపం వచ్చిన వేళ

ప్రముఖ క్రికెట్ దిగ్గజం M.S.ధోని తన ఆటతోనే కాక వ్యక్తిత్వంతోనూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కాగా ఆయన ఆటలో ఎప్పుడూ కూల్‌గా ఉంటారు. దీంతో ఆయనను తన అభిమానులంతా Mr. Cool అని పిలుచుకుంటారు. మరి అలాంటి Mr. Coolకి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రస్తుతం ధోని IPL 2023కి CSK కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే నిన్న CSK Vs LSGకి మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లక్నోపై చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించారు. ఈ మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 18 రన్స్ ఇచ్చారు. అందులో 13 వైడ్ బాల్స్ ,3 నో బాల్స్ ఉన్నాయి. కాగా దీనిపై కెప్టెన్ ధోని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ధోని బౌలర్ల తీరుపై కాస్త మండిపడ్డారు. వాళ్లు నో బాల్స్ వేయకూడదు. వైడ్లు తక్కువగా వేయాలి. ఇది మరోసారి రిపీట్ అయితే వారు ఈసారి మరొకరి కెప్టెన్సీలో ఆడాల్సి వస్తుందన్నారు. ఇది వారికి నా సెకెండ్ వార్నింగ్ అని నవ్వుతూనే హెచ్చరించారు.