దసరా రోజే విశాఖకు రాజధాని తరలింపు
విశాఖ రాజధానిపై కసరత్తు పూర్తయ్యింది. దసరా రోజే విశాఖకు రాజధాని తరలింపు జరగాలని ముహూర్తం ఖరారయ్యింది. సీఎంవోతో పాటు ముఖ్య శాఖలను కూడా తరలించనున్నారు. సీఎం కార్యాలయం విశాఖ నుండే పరిపాలన సాగనుంది. వివిధ శాఖల ముఖ్యాధికారులు, ఆఫీసులు ఏర్పాటు కానున్నాయి. విశాఖకు రాజధాని తరలింపు కోసం కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఉన్నతాధికారుల ఆఫీసులు, నివాసాలు ఏర్పాట్లపై పరిశీలన కోసం మున్సిపల్, ఆర్థిక, జీఎడీ అధికారులతో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ దసరా నుండే విశాఖకు రాజధాని అంటూ జగన్ చేసిన ప్రకటనతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు అధికారులు. మౌలిక వసతుల ఏర్పాట్లలలో కూడా శ్రద్ధ తీసుకుంటున్నారు.

