Home Page SlidermoviesNationalNews Alert

‘జాన్వీలో శ్రీదేవిని చూడలేకపోతున్నా’..ఆర్జీవీ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి దివంగత హీరోయిన్ శ్రీదేవి అంటే చాలా అభిమానం అని అందరికీ తెలుసు. శ్రీదేవిని దేవతగా ఆరాధిస్తానని అనేక సందర్భాలలో వర్మ చెప్పారు. తాజాగా ఆమె కుమార్తె జాన్వీ కపూర్‌తో సినిమా చేస్తారా అని ఒక ఇంటర్యూలో అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు ఆర్జీవీ. తాను జాన్వీలో ఇంకా శ్రీదేవిని చూడలేకపోతున్నానని, శ్రీదేవి అంటే తనకెంతో ఇష్టమని, ఆమెకు వివాహం జరిగినప్పుడు తాను ఎంతో షాక్‌కు గురయ్యానని పేర్కొన్నారు. జాన్వీ కపూర్‌తో సినిమా చేసే ఉద్దేశం ఇప్పట్లో లేదన్నారు. శ్రీదేవి నటన ప్రతీ సినిమాలోనూ అద్భుతంగా ఉంటుందని, తాను దర్శకుడని మరిచిపోయి చూస్తూ ఉండిపోయేవాడినని పేర్కొన్నాడు. అయితే జాన్వీకపూర్ మాత్రం అనేక ఇంటర్యూలలో తనను తల్లి శ్రీదేవితో పోలిస్తే చాలా అదృష్టంగా భావిస్తానని పేర్కొంది.