పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 జూన్ నాటికి పోలవరం పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. టీడీపీ హయాంలో తాము 72% ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇచ్చామన్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక 2025 నాటికి పోలవరం ఫేజ్-1 పూర్తి చేస్తామని చెబుతుంది. అయితే ఇలా చెప్పడానికి వైసీపీ ప్రభుత్వానికి సిగ్గులేదా అని చంద్రబాబు విమర్శించారు. వైసీపీ హయాంలో అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని దుస్థితి నెలకొందన్నారు.వైసీపీ ప్రభుత్వం పోలవరాన్ని నాశనం చేసి రాష్ట్ర ప్రగతిని,ప్రజల భవిష్యత్తును అడ్డుకుంటుందని చంద్రబాబు ఆరోపించారు.

