అమెరికాకు కెనడా సాయం..
అమెరికాలోని లాస్ ఎంజెలెస్‌లో కార్చిచ్చు దవానలంలా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చును ఆపడానికి సహాయం చేస్తామంటూ కెనడా ముందుకొచ్చింది. కార్చిచ్చులు మాకేం కొత్త కాదని, ఈ విషయంలో అమెరికాకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని కెనడా ప్రధాని ట్రూడో ప్రకటించారు. కాలిఫోర్నియా వద్ద ఏర్పడిన కార్చిచ్చు గురించి కెనడియన్లు ఆందోళన చెందుతున్నారని ఆయన వివరించారు. అనేకమంది సినీతారలు, సెలబ్రెటీలు ఇళ్లు, సంపదలు కోల్పోయారు. ఇప్పటి వరకూ 1200 నివాసాలు దగ్ధమయ్యాయి. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఒకటిన్నర లక్షల మంది ఇళ్లు ఖాళీ చేశారు. ఇప్పటి వరకూ 50 బిలియన్ల డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.4.2 లక్షల కోట్ల సంపద కాలి బూడిదయ్యింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ ఇల్లు కూడా కాలిపోయింది.