Home Page SliderInternational

భారత్‌పై కెనడా నోటి దురుసు

బిష్ణోయ్ ఉగ్రవాద గ్రూప్‌కు భారత ప్రభుత్వ ఏజెంట్లతో సంబంధాలున్నాయంటూ కెనడా నోరు పారేసుకుంది.  గతంలో కూడా ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకేసులో ఏకంగా భారత హైకమిషనర్ సంజయ్‌కుమార్ వర్మను అనుమానితుల జాబితాలో చేర్చి భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. ఇప్పుడు బిష్ణోయ్ గ్యాంగ్‌తో కలిసి భారత ఏజెంట్లు, ప్రో ఖలీస్తానీలను లక్ష్యంగా చేసుకుని కెనడా భూభాగంపై పనిచేస్తున్నారని బురద జల్లుతోంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై నిజ్జర్ హత్యకేసు దర్యాప్తుకు సహకరించడం లేదంటూ ఆరోపణలు చేస్తున్నాడు. అయితే ఈ ఆరోపణలన్నింటినీ భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఖండిస్తోంది. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేయడాన్ని తప్పుపట్టింది. మరోవైపు బ్రిటన్ ప్రధాని కిర్ స్టార్‌మర్‌తో, కెనడా ప్రధాని ట్రూడో ఫోన్‌లో మాట్లాడి, భారత ప్రభుత్వంతో సంబంధాలు ఉన్న ఏజెంట్లు కెనడా పౌరులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారంటూ కంప్లైంట్లు చేసినట్లు సమాచారం.