Home Page SliderInternational

కెనడా ఖలిస్తానీ టెర్రరిస్ట్ హత్య వ్యవహారంపై ఆస్ట్రేలియా రియాక్షన్

ఖలిస్తానీ ఉగ్రవాదిని హతమార్చడంలో భారత అధికారుల పాత్ర ఉందన్న కెనడా ఆరోపణపై వచ్చిన వివాదంపై ఆస్ట్రేలియా రియాక్ట్ అయ్యింది. ఈ సమస్యపై ఇండియాతో మాట్లాడుతున్నట్టు పేర్కొంది. భారతదేశం, జపాన్, యునైటెడ్ స్టేట్స్‌తో కూడిన క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ లేదా క్వాడ్‌లో ఆస్ట్రేలియా సభ్య దేశం. కెనడా, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, న్యూజిలాండ్‌లతో ఫైవ్ ఐస్ ఇంటెలిజెన్స్ కూటమిలో కూడా ఆస్ట్రేలియా సభ్యదేశం. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై ఆస్ట్రేలియా స్పందించింది. అదే సమయంలో ఆస్ట్రేలియాలోనూ సిక్కులు ఆందోళనలకు దిగుతుండటంతో ఈ వ్యవహారంపై కేంద్రంతో చర్చిస్తోంది. ఇటీవల కెనడా పార్లమెంట్‌లో ప్రధాని జస్టిన్ ట్రూడో మాట్లాడుతూ, జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్యను భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణలు నమ్మదిగినవేనంటూ మాట్లాడారు. ఐతే తెల్లారి ఆయన మాట మార్చారు. ట్రూడో భారతదేశాన్ని “రెచ్చగొట్టడం” లేదా “ఉద్రిక్తతను పెంచడం” తన ఉద్దేశం కాదని… నిజ్జర్ హత్యను “అత్యంత గంభీరంగా” పరిగణించాలని కోరుతున్నానన్నాడు. ఐతే, కెనడా ప్రధాని చేసిన ఆరోపణను “అసంబద్ధమైనదిగానూ, ప్రేరేపించబడినది” అని తిరస్కరించింది.

Mr ట్రూడో క్లెయిమ్‌పై విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ స్పందిస్తూ, మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఆస్ట్రేలియా సమస్యను భారతీయ సహచరులతో మాట్లాడుతున్నామన్నారు. క్వాడ్‌లో సభ్యదేశంగా ఉన్నందున, జపాన్‌తో సమస్యను లేవనెత్తాలని ఆస్ట్రేలియా యోచిస్తోందా అనే విషయంపై తాను మాట్లాడబోనన్నారు. దేశాలు ఆయా దేశాల సార్వభౌమాధికారం, చట్ట నియమాలను గౌరవించాలన్నారు.

ఆస్ట్రేలియా బలమైన ప్రజాస్వామ్యమని, భారతీయ ప్రవాసులు అనేక రకాల అభిప్రాయాలను కలిగి ఉంటారని, దానిపై తాము జోక్యం చేసుకోబోమన్నారు. విభిన్న అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తీకరించడం ఆస్ట్రేలియా ప్రజాస్వామ్యంలో కీలకమైన భాగమని చెప్పారు. చాలామంది ఆస్ట్రేలియన్లు దీంతో ఏకీభవిస్తారన్నారు. ” కాన్‌బెర్రా ఆందోళనలపై ఇండియాతో తామేం మాట్లాడింది మీడియాకు చెప్పలేమన్నారు. ఈ నెల ప్రారంభంలో న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్‌లో ఈ అంశాన్ని ప్రైవేట్‌గా ప్రస్తావించారా లేదా అనే వివరాలను వెల్లడించడానికి కూడా ఆమె నిరాకరించారు. ఆస్ట్రేలియాలో సిక్కు భారతీయులు ప్రమాదంలో ఉన్నారనే ప్రశ్నకు వాంగ్ స్పందించారు. కెనడా ప్రధాని ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని… త్వరలోనే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. ఆస్ట్రేలియాలో సిక్కుల ఆందోళనలకు సంబంధించి, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు పౌరులు కలిగి ఉంటారని ఆమె చెప్పారు.