అనంతపూర్‌లో కరవు తాండవిస్తుంటే జగన్‌కు కనిపించట్లేదా?: పురందేశ్వరి
అనంతపురం: ఎన్నికలకు ముందు రైతులకు జగన్ అనేక హామీలు ఇచ్చి పెడచెవిన పెట్టారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విమర్శించారు. అనంతపురంలో ఆమె పర్యటించారు. పుట్టపర్తిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పర్యటన సందర్భంగా వైకాపా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అనంతపురం కరవుతో అల్లాడుతుంటే జగన్‌కు ఎక్కడా కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. ఇవాళ బటన్లు నొక్కుతూ రైతులను, ప్రజలను ఆయన మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సాగు, తాగునీరు అందిస్తామని ఎన్నికల ముందు చెప్పినమాట ఏమైందని ఆమె నిలదీశారు. శీతల గిడ్డంగుల ఏర్పాటుపై ఏ చర్యలు తీసుకోవడం లేదని పురందేశ్వరి విమర్శించారు.