ఈటల, కోమటిరెడ్డిలకు దిల్లీకి పిలుపు
బీజేపీ అధిష్టానం నుండి ఈటల రాజేందర్, కోమటిరెడ్డిలకు దిల్లీకి రమ్మని పిలుపు వచ్చింది. ఇంటిటికీ బీజేపీ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్న తరుణంలో తెలంగాణ బీజేపీ అగ్రనేతలు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. దీనితో వీరు పార్టీ పై అసంతృప్తిగా ఉన్నట్లు గ్రహించారు. దీనితో అమిత్ షా, జేపీ నడ్డా వీరిని దిల్లీకి రమ్మని ఆహ్వానించినట్లు సమాచారం. అసంతృప్త నేతలను బుజ్జగించి పార్టీ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేలా చేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యనేతలు పార్టీ మారే ప్రమాదం ఉంది. తెలంగాణ బీజేపీలో బండి సంజయ్, ఈటల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందని అందరికీ తెలిసిందే. వీరు పార్టీని వీడతారనే ఆందోళనతోనే వీరిని దిల్లీకి పిలుపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సాయంత్రం వీరు దిల్లీకి బయలుదేరుతున్నారు. వీరికి కొత్త బాధ్యతలు ఏవైనా ఇస్తారేమో అనే చర్చలు కొనసాగుతున్నాయి.