కొత్త జిల్లాల ఏర్పాటు పై సీఎం తో క్యాబినెట్ సబ్ కమిటీ
అమరావతి: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు మరియు జిల్లా కేంద్రాల మార్పులపై ముఖ్యమైన చర్చలు జరగనున్నాయి. ఈ అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో క్యాబినెట్ సబ్ కమిటీ రేపు సమావేశం కానుంది.
ఇప్పటికే సబ్ కమిటీ ఈ విషయంలో పలు సూచనలు చేసినట్లు సమాచారం. రేపటి సమావేశంలో కొత్త జిల్లాల రూపకల్పన, సరిహద్దుల మార్పు, మరియు పరిపాలనా సౌకర్యాలపై మరింత స్పష్టత రానుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ప్రభుత్వం డిసెంబర్ 31వ తేదీ లోగా జిల్లాల పునర్విభజన పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే నవంబర్ 7న జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

