ప్రజాపాలన హామీల అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ
ప్రజాపాలన హామీల అమలు కోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యవహరిస్తారు. కమిటీ సభ్యులుగా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఉంటారు. ఎన్నికల కోడ్ వచ్చే వారకు తాము టైమ్ పాస్ చేయబోమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అనవసరమైన కారుకూతలు కూస్తే సహించమన్నారు. నిజమైన అర్హులను గుర్తిస్తామన్నారు. ఆరు పథకాలు ప్రజలకు చేర్చే బాధ్యత కమిటీదేనన్నారు పొంగులేటి.

