జనవరి 4న కేబినేట్ భేటీ
తెలంగాణ మంత్రివర్గ సమావేశం జనవరి 4న సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ లో జరుగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రైతు భరోసా, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సహాయం, కొత్త రేషన్ కార్డులు, ఎస్సీ వర్గీకరణ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక, యాదగిరిగుట్ట ఆలయ బోర్డు ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. సంక్రాంతి నుంచే రైతు భరోసా పథకం అమలు చేస్తామని ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలన్న అంశంతోపాటు కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాల ఖరారుపై సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ యాంత్రీకరణ, వీఆర్వో వ్యవస్థ, భూభారతి అమలు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లుగా సమాచారం.

