ముగిసిన కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్
ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులతో చర్చించారు సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. చెత్తపన్ను రద్దు అమలు విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలకు ఉచిత సిలిండర్ల పంపిణీ పథకంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చ సాగింది. మరోవైపు దేవాలయాల పాలకమండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇద్దరు బ్రాహ్మణులు పాలకమండలిలో ఉండాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఉచితంగా ఇసుక పంపిణీ పథకంలో ట్రాక్టర్లు, లారీలతో పాటుగా ఎడ్ల బండ్లలో కూడా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.