క్యాబినెట్ విస్తరణ అప్పుడే..
టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై అప్‌డేట్ ఇచ్చారు. క్యాబినెట్ విస్తరణ ఉంటుందని, కానీ అది సంక్రాంతి తర్వాతే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్‌లను మారుస్తారన్న వార్తలపై ఇంకా సమాచారం లేదన్నారు. కొంతమంది బలమైన నేతలున్న నియోజక వర్గాలలో కొత్త చేరికలను ప్రోత్సహించడం లేదని తెలిపారు. అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మిత్రపక్షాలకు తప్పకుండా మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని తెలియజేశారు.