Andhra PradeshHome Page Slider

రాష్ట్రంలో సమగ్ర కులగణనకు కేబినెట్ నిర్ణయం

నవంబరు 15-డిసెంబరు 15 ఆరోగ్యశ్రీ యాప్ పై అవగాహన
వ్యవసాయ సహకార శాఖకు రూ.5 వేల కోట్ల రుణం
ప్రతి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ

ఏపీ సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ సమావేశం ముగిసింది. 38 అంశాల అజెండాతో సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ఆ వివరాలను మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశంలో తెలిపారు. సంక్షేమపథకాల షెడ్యూల్డ్‌ విడుదల చేశారు. నవంబరు 7వ తేదీన వైఎస్సార్‌ రైతు భరోసా. -నవంబరు15 భూపంపిణీ. నవంబరు 28 న విద్యాదీవెన అందిస్తారు. ఖరీప్ 2023-24 దాన్యం సేకరణకు మార్క్ ఫెడ్ రూ.5 వేల కోట్ల రుణమంజూరుకు ప్రభుత్వం తరపున ఆవసరమైన గ్యారంటీ. అందించేందుకు కేబినెట్ ఆమోదించిందని, ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్, ఆధ్వర్యంలో ఖరీప్ ధాన్యం సేకరణ జరుగుతుందిని మంత్రి చెల్లుబోయిన తెలిపారు. రాష్ట్రంలో వివిధ కొత్త పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తూ, సీఎం జగన్ అధ్యక్షతన గత నెల 30వ తేదీన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. రెండు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలన్న ఎస్ఐపీబీ నిర్ణయానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.

రహదారుల, భవనాలశాఖలో 467 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదించిందని, అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయాలని నిర్ణయించిందని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, భవనాలశాఖ పరిధిలో గెస్ట్ హౌస్ల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఆర్ అండ్ బిశాఖ సమకూర్చుకుంటుని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల, గోపాలపురం, తాళ్లపూడి మండలాలతో కలిపి దేవరాపల్లిలో రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందని, ఈ కార్యాలయంలో ఆవసరమైన ఒక మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, ఒక హోంగార్డు నియామకానికి ఆమోదం లభించిందని తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 6 మండలాలు ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, రామగిరి, కనగానపల్లె నీ కె పల్లె)తో కలిపి రవాణాశాఖకు చెందిన యూనిట్ ఆఫీసు ఏర్పాటుకు, మంత్రిమండలి ఆమోదించిందని, ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ఆసిస్టెంట్, ఒక టెక్నికల్ ఇంజనీరు. ఇద్దరు సెక్యూర్టీ గార్డులు, ముగ్గురు హోంగార్డుల నియామకానికి కేబినెట్ పచ్చ జెండా ఊపిందన్నారు.

జగనన్న సురక్ష ద్వారా 11,700 క్యాంపులు, 8లక్షలకు పై కంటి పరీక్షలు
జగనన్న సురక్ష కార్యక్రమంపై కేబినెట్ కు అధికారులు వివరాలు అందించారని, ఇప్పటివరకూ 11710 క్యాంపులు నిర్వహించినట్లు తెలిపారు. 60 లక్షల మంది శిబిరాల వద్దకు వచ్చారని, 6.4 కోట్ల మందికి ఇంటివద్దే వైద్య ర్యాపిడ్ పరీక్షలు నిర్వహించామని, 8,72,212 మందికి కంటి పరీక్షలు చేశామని పేర్కొన్నారు. 52,547 మందికి కంటి అద్దాలు ఇచ్చామన్న అధికారులు 11327 మందికి కంటి చికిత్సలు చేయిస్తున్నామన్న అధికారులు. జగనన్న సురక్ష కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందన్న’వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మంచి వైద్య సహాయం లభిస్తుందని మంత్రులు అభినందించినట్లు తెలిపారు

ఆరోగ్యశ్రీ యాప్ పై అవగాహన కార్యక్రమం
గతంలో ఆరోగ్య శ్రీ చికిత్సలు చేయించుకున్నవారి, శిబిరాల ద్వారా ఆస్పత్రుల్లో చికిత్స అవసరమని భావించినవారికి, తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ కేటగిరీలకు చెందినవారిపై ప్రత్యేత శ్రద్ధ వహించాలన్న సీఎం సూచించినట్లు తెలిపారు. వారికి అవసరమైన తుదపరి చికిత్సలు కూడా ఆరోగ్య శ్రీ కింద అందించాలని సీఎం పేర్కొన్నారని వివరించారు. “ఆస్పత్రులకు వారు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వాలన్న సీఎం సూచించారు, అంతేకాకుండా మందులు కూడా సకాలంలో వారికి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. చికిత్సలు పూర్తయిన తర్వాత కూడా వారి ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్న జగనన్న సురక్ష శిబిరాలు బాగా జరిగేలా చూడాలని సీఎం మంత్రులను ఆదేశించారు. శిబిరాల్లో గుర్తించిన పేషెంట్లకు మంచి చికిత్స అందేలా చూడాలన్న సీఎం. వారు ట్రీట్మెంట్ ముగించుకుని తిరిగి ఇంటి వచ్చాక వారికి మందులు అందేలా. తదుపరి చికిత్స అందించేలా చూడాలని సీఎం అన్నారు. ఎవ్వరికీ మందులు అందలేదన్న మాట వినపడకూడదని, ఈ మందులన్నీ ఉచితంగా అందిస్తున్నామని, రిఫరెల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లేదా ఆస్పత్రికి పంపించాలని సీఎం ఆదేశించారు. ప్రయాణ ఖర్చులు కింద రూ.500 అందించాలని దీంతోపాటు గ్రామాల్లో గతంలో తీవ్ర రోగాల బారినపడ్డ పేషెంట్లకు కూడా అండగా నిలవాలాని, వారికి కావాల్సిన మందులకు ఉచితంగా అందించాలని, అవసరమైన పక్షంలో డాక్టర్లకు రిఫరెల్ కూడా చేసే బాధ్యతలను నిర్వర్తించాలని, గతంలో ఆరోగ్య శ్రీకింద చికిత్సలు చేయించుకున్న వారి ఆరోగ్య పరిస్థితులపై కూడా ఆరాతీయాలని, అవసరమనుకుంటే వారినికూడా రిఫరెల్కు పంపించాలని, వీరికి చేయూత నివ్వాలని, ఆరోగ్య సురక్ష కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతా కార్యక్రమమని, కచ్చితంగా దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సూచించారు.

అత్యంత ఖరీదైన మందులు కూడా ఉచితంగా అందించాలని. మంత్రులు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, జనవరి 1 నుంచి ప్రతినెలా నాలుగు క్యాంపులు ప్రతి మండలంలో నిర్వహిస్తారని, నలుగురు స్పెషలిస్టు డాక్టర్లు కూడా ఇందులో పాల్గొంటారని, ప్రతి వారంలో ఒక మండలంలో ఒక గ్రామ సచివాలయంలో క్యాంపు నిర్వహిస్తారని అందులోకూడా పైన చెప్పిన విధంగా రోగులపై ప్రత్యేక ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఉధృతంగాదృష్టిపెట్టాలని ఆరోగ్య శ్రీని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై ఉద్భతంగా ప్రచారం చేపట్టాలని సీఎం వివరించారు. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకూ మరోసారి ఈ కార్యక్రమం జరుగుతుంది. దిశ యాప్ను ఏ రకంగా డౌన్లోడ్ చేశామో, ఆరోగ్య శ్రీ యాప్ను కూడా డౌన్లోడ్ చేస్తాం” అని మంత్రి చెల్లుబోయిన వివరించారు. గ్రామాల్లో ఎక్కడా కూడా పౌష్టికాహార లోపంతోకాని, రక్తహీనతతో బాధపడేవారుకాని ఉండకూడదన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, వారికి సరైన ఆహారం, మందులు అందిస్తున్నామని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమం పై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, కంటి సమస్యలతో బాధపడేవారికి కూడా కంటి అద్దాలు ఇస్తున్నామని తెలిపారు.

మార్కాపురం మెడికల్ కాలేజీలో 21 పోస్టులతో నెఫ్రాలజీ డిపార్ట్మెంటు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందని, పలాస తరహాలో తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి మెరుగైన చికిత్స, అవసరమైన వైద్య సేవలు అందించేందుక అవసరమైన కిడ్నీ పరిశోధనా కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకూ మంత్రిమండలి ఆమోదం తెలిపిందన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మున్సిపాల్టీలో పురపాలకశాల భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబికెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

6,790 ప్రభుత్వ స్కుళ్లలో ఫ్యూచర్ స్కిల్స్ పై బోధన, దీనికోసం మ్యాపింగ్ చేయనున్న ఇంజనీరింగ్ కాలేజీలు. ప్రభుత్వ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన, మెరుగైన విద్యను అందించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 6730 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ ఎక్స్ఫర్డ్ నియమించాలన్న పాఠశాల విద్యాశాఖ నిర్ణయానికి మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. 16,190 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్ పై బోధనకోసం ఇంజినీరింగ్ కాలేజీల మ్యాపింగ్ చేస్తామని, ట్యాబులు డిజిటల్ పరికరాలు, యాప్లు వినియోగంపై విద్యార్థులకు శిక్షణ దీని ఉద్దేశమని, అలాగే ఆరో తరగతి నుంచి ప్రతి తరగతి గదిలో పెట్టి ఐఎఫ్ ప్యానెల్స్ వినియోగంపైనా వీరు శిక్షణ ఇస్తారని వెల్లడించారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే సరిదిద్దుతారని, పరికరాల వినియోగంపై టీచర్లనుంచి, విద్యార్థులనుంచి ఫీడ్ బ్యాక్ ఇస్తారని, వినియోగం తీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారని, సాంకేతికను వినియోగించుకుని విద్యార్థుల సమర్ధతలో పెంచేలా చూస్తారని, డేటా ప్రైవసీ, సెక్యూరిటీలపై తగిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.

50 ఎకరాల లోపు ఏపీఐఐసీ కేటాయించిన 285 భూకేటాయింపులకు క్యాబినెట్ గ్నీన్ సిగ్నెల్ ఇచ్చిందని భారీ ప్రాజెక్టులకు వివిధ రకాల రాయితీలను కల్పిస్తూ,స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదలనకు కేబినెట్ ఆమోదించిందని, ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ కాంప్లెస్, డిజిల్ బస్ రిబ్రో ఫిటింగ్, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ తయారు చేసే పెప్పర్ మోషన్ సంస్థ ఇది రూ.4.640 కోట్లు పెట్టుబడి పెట్టడలతో పాటు 8000 మందికి ఉపాధి అందించనుంని, దీంతో పాటు ఎస్ఎస్ఐపీబీలో తీసుకున్న నిర్ణయాలకూ క్యాబినెట్ ఆమోదించిందని వివరించారు. అనకాపల్లి జిల్లా పూడిమడక వద్ద గతంలో ధర్మల్ పవర్ -ప్రాజెక్టుకోసం 1200 ఎకరాలు ఇచ్చిన ఏపీఐఐసీ ఇందులో హైడ్రోజన్ హబ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించిందని, దీనికోసం సబ్ లీజింగ్కు అనుమతి ఇచ్చిన కేబినెట్. -రూ. 95వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న ఏ -ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటుతో పాటు ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులకై ఏపీఐఐసీ ప్రతిపాదనల మేరకు ఎన్టీపీసీ లిమిటెడ్కు అనుమతులు మంజారు చేస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుందన్నారు.

కేబినెట్ ఆమోదించిన ప్రతిపాదనలు

తిరుపతి జిల్లా పేరూరులో ఎంఆర్కేఆర్ గ్రూపు హోటల్ నిర్మాణానికి అదనంగా మరో 2 ఎకరాల భూమిని కేటాయిస్తూ… తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. వైయస్సార్ జిల్లా గండికోటలోనూ, విశాఖపట్నంలో మేపెయిర్ గ్రూపులకు గతంలో కేటాయించిన భూములు కాకుండా కొత్త సర్వేనెంబర్లలో భూకేటాయింపులు.

విశాఖపట్నానికి చెందిన అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్- 1 అధికారిగా నియమించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. రెండు ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన సాకేత్ మైనేని. డేవిస్కప్ టీంలో 11 ఏళ్లపాటు కొనసాగిన సాకేత్.. 2016 నుంచి 2017 వరకూ ఇండియా నంబర్ 1గా మైనేని.

ఏపీ ఫెర్రో అల్లాయిస్ ప్రోడ్యూసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు వివిధ రకాల విద్యుత్ డ్యూటీలలో మినహాయింపులు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం. ఫెర్రో అల్లాయిస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ డ్యూటీ నుంచి కొంత మినహాయింపు.. స్టీల్ ఇండస్ట్రీలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఈపరిశ్రమలకు తోడ్పాటు నిచ్చేందుకు నిర్ణయం. రూ.766 కోట్ల మేర భారాన్ని మోయనున్న’ ప్రభుత్వం దాదాపు 50 వేలమంది ఈ పరిశ్రమలపై ఆధారపడి ఉన్నందున నిర్ణయం తీసుకున్న కేబినెట్.

902 మెగావాట్ల సామర్ధ్యమున్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు నంద్యాల, వైఎస్సార్ జిల్లాలలో 5,400 ఎకరాలు లీజు ప్రాతిపదికన కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. ఏడాదికి రూ. 31వేలు ఎకరాకు చెల్లించనున్న కంపెనీ రెండేళ్లకు 5శాతం చొప్పున పెంపు.

కర్నూలు జిల్లాలో 800 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఎకోరన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అనుమతిలిస్తూ కేబినెట్ ఆమోదం.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ (01-07-2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్ధికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు 3.64 శాతం డీఏ (01-07-2022 నుంచి) ఇవ్వాలన్న ఆర్థికశాఖ ప్రతిపాదనను రాటిఫై చేసిన కేబినెట్.

రాష్ట్రంలో 100 ఇన్స్ఫెక్టర్ ఆఫ్ పోలీసు పోస్టులను భర్తీ చేయాలన్న నిర్ణయానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ఇందులో 45 పోస్టులు అప్డేషన్, 55 సూపర్ న్యూమరరీ పోస్టులు.

ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీలో 22 పోస్టుల భర్తీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. విజయవాడతో పాటు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో భర్తీ.

సమగ్ర కులగణనకు కేబినెట్ ఆమోదం. ఆర్ధిక, సామాజిక, విద్యాపరమైన జీవనోపాధి, జనభాసమతుల్యత అన్న అంశాలపై గణన. అణగారిన వర్గాలు మరింత అభ్యున్నతికి ఈ డేటా ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. ఆర్ధిక సామాజిక అభివృద్ధి కల్పించేందుకు దోహదపడుతుందని, ప్రభుత్వ పథకాలు అందకుండా ఎవరైనా మిగిలిపోయినా కూడా ఈ గణన ద్వారా తెలుస్తుందని, తద్వారా వారు లబ్ధిపొందుతారన్న కేబినెట్. మరిన్ని పేదరిక నిర్మూలనా పథకాలకు, మానవవనరుల అభివృద్ధికి, తారతమ్యాలు తగ్గించేందుకు, అసమానతలు రూపుమాపేందుకు ఈ డేటా వినియోగపడుతుందన్న సీఎం. కులగణన చేయాలన్న నిర్ణయాన్ని ఆమోదించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రివర్గసభ్యులు.

ఎంప్లాయి ఫ్రెండ్లీ గవర్నమెంటు అన్న మాటను మరోసారి నిలబె ట్టుకుంటూ ప్రభుత్వ సర్వీసులకు సంబంధించిన లోకల్ కేడర్స్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రాఫ్ట్ ఆర్డర్ 2023కు ఆమోదం. రాష్ట్ర స్థాయి పోస్టులన్నీ సెక్రటేరియట్, విభాగాధిపతుల (హెచ్డీలు) కార్యాలయాలు, రాష్ట్ర స్థాయి సంస్థలు, పోలీస్ కమిషనరేట్లు తప్ప మిగిలిన అన్ని స్టేట్ లెవెల్ పోస్టులు మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయి. రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్లు, 6 జోన్లుగా విభజన. స్థానికులకు మరింత ఉపాధి లభించేలా 95 శాతం పోస్టులు స్థానికులకే. గతంలో ఇది 80 20 శాతంగా ఉండేది.

కర్నూలులో సెకండ్ నేషనల్ లా యూనివర్సిటీ, స్టేట్ క్వాజీ జ్యుడీషియల్ అండ్ లీగల్ ఇనిస్టిట్యూషన్స్ ఏర్పాటుకు అవసరమైన మరో 100 ఎకరాల భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఇప్పటికే వీటికోసం 50 ఎకరాల భూమి కేటాయించిన ప్రభుత్వం. కర్నూలులో రెండో జాతీయ నేషనల్ లా యూనివర్శిటీకి 100 ఎకరాలు అదనంగా కేటాయించేందుకు కేబినెట్ నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కన్జూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్, ఏపీ లేబర్ కమిషన్. ఏపీ వ్యాట్ అప్పిలేట్ ట్రిబ్యునల్, ఏపీ వక్ఫ్ బోర్డ్ , లోకాయుక్త తదితర సంస్థలకు ఉపయోగం.

దేవాదాయశాఖలో కేడర్ను బలోపేతం చేసేందుకు, దేవాదాయశాఖ కమిషనర్ పరిధిలో ఒక డిప్యూటీ కమిషనర్ పోస్టు ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం.

ఆయా దేవాలయాలు ఆర్జించే ఆదాయాలు ఆధారంగా ఏర్పాటు చేసే పోస్టులకు సంబంధించిన ఆదాయపరిమితిని పెంచిన నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. గతంలో డిప్యూటీ కమిషనర్ పరిధిలో రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఉంటే ఇప్పుడు దానిని రూ.7 నుంచి రూ.12 కోట్లకు పరిమితి పెంపు.జాయింట్ కమిషనర్ పరిధిలో గతంలో రూ.1 కోటి ఉంటే దానిని రూ.12 కోట్లు కంటే ఎక్కువ పరిమితి పెంపు.

విశాఖపట్నం జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, యూజర్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలన్న ప్రతిపాదనను ఆమోదించిన మంత్రిమండలి.

పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల పునరావాసంలో భాగంగా… ఏలూరు జిల్లా పరిధిలో పోలవరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల పరిధిలో 12,984 కుటుంబాలకు, రాజమహేంద్రవరం జిల్లాలో దేవీపట్నం, కూనవరం, వరరామచంద్రపురం మండలాల్లో 3,823 కుటుంబాలకు కేటాయించి ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్, భూమి కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ భూమి కేటాయింపునకు సంబంధించిన రిజిస్ట్రేషను ఉచితంగా చేయాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు 4.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లెలో ఏపీఐఐసీకి 2.92 ఎకరాల భూమిని కేటాయించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.

శ్రీకాకుళం, విశాఖపట్నం, నెల్లూరు. అన్నమయ్య జిల్లాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అసరమైన భూమిని కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.

నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరులో 39.08 ఎకరాల భూమిని రామాయపట్నం నాన్ మేజర్ పోర్టు నిర్మాణం కోసం ఏపీ మారిటైమ్ బోర్డుకు కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకు అంగీకారం తెలిపిన రాష్ట్ర మంత్రిమండలి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రిడేటెడ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్.

విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం నరవలో ప్రముఖ జానపదకళాకారుడు వంగపండు ప్రసాదరావు సతీమణి శ్రీమతి వంగపండు విజయలక్ష్మికి 1000 గజాల ఇంటిస్థలం కేటాయించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.

వైయస్సార్ జిల్లా పులివెందుల మండలం నగరిగుట్టకు చెందిన గిరిజనులకు పులివెందుల మండలం ఎర్రగుడిపల్లెలో 61 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం.