Breaking NewsHome Page SliderPolitics

వైఎస్సార్ జిల్లా మార్పుకు కేబినెట్ ఆమోదం

వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ క‌డ‌ప జిల్లాగా మారుస్తూ ఏపి కేబినెట్ ఆమోదం తెలిపింది.గ‌తంలో క‌డ‌ప జిల్లా పేరును … వైఎస్సార్ మ‌ర‌ణించాక దాన్ని అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం వైఎస్సార్ క‌డ‌ప‌ జిల్లాగా మారుస్తూ నిర్ణ‌యం తీసుకుంది.దాన్ని వైసీపి హ‌యాంలో వైఎస్సార్ జిల్లాగా మ‌ళ్లీ మార్పు చేశారు.అయితే కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక‌…వైస్సార్ జిల్లాని వైఎస్సార్ క‌డ‌ప జిల్లాగా మారుస్తూ జీవో జారీ చేశారు.దీనిపై వైసీపి శ్రేణులు స్పందిస్తూ ఇలాంటి చర్య‌లు చేప‌ట్టి సంక్షేమాన్ని దారి మ‌ళ్లించ‌డం త‌ప్ప కూట‌మి ప్ర‌భుత్వం చేసే అభివృద్ది ,సుప‌రిపాల‌న అంటూ ఏమీ ఉండ‌బోమ‌ని ఎద్దేవా చేస్తున్నారు.