బై బై బేబక్క…..తెలుగు బిగ్ బాస్!
బిగ్ బాస్ సీజన్ 8 జోరుగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో హౌస్ లో ప్రస్తుతం 13మంది హౌస్ మేట్స్ ఉన్నారు. లాస్ట్ వీక్ జరిగిన నామినేషన్స్ లో విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఉండగా ఒకొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. శనివారం రోజు సోనియాని సేవ్ అయ్యింది. ఆదివారం ఎపిసోడ్ లో శేఖర్ బాషాని ఫస్ట్ సేవ్ చేశారు. తరువాత పృథ్వీ, విష్ణు ప్రియ సేవ్ అయ్యారు. చివరికిగా నాగ మణికంఠ, బేబక్క, ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారు. చాలా మంది నాగమణికంఠ వెళ్ళిపోతాడని అనుకున్నారు. కానీ చివరిలో ఊహించని విధంగా బేబక్కను ఎలిమినేట్ అయ్యింది.. బేబక్కను ఎలిమినేట్ తో హౌస్ లో ఉన్న వాళ్ళంతా చాలా నిరాశగా ఉన్నారు.


 
							 
							