ఏసు దయవల్లే దేశంలో కరోనా తగ్గింది…
తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు శ్రీనివాసరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. యేసు దయ వల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. భారత దేశ అభివృద్ధికి యేసుక్రీస్తే కారణమని చెప్పారు. చాలా మంది దేవుళ్ళు ఉన్నా… భూమి మీద నడయాడిన నేల ఉందంటే అది ఏసుక్రీస్తు మాత్రమే అన్నారు. పూర్వీకులు ఇదంతా చూశారని, భవిష్యత్తు తరాల వారికి చెప్పాలన్నారు. డీహెచ్ శ్రీనివాస్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.