బంగారు నగల కొనుగోలు ఇకపై అంత ఈజీ కాదు
బంగారు నగల కొనేవారికి కేంద్రం కొత్త రూల్స్ పెట్టింది. అదేటంటే ఇకమీదట హాల్ మార్క్ లేకుండా ఆభరణాలు అమ్మడానికి వీల్లేదు. ఇంతవరకు పెద్ద పేరు పొందిన షాపుల్లోనే హాల్‌మార్క్ నగలు దొరికేవి. మామూలు చిన్నషాపుల్లో అమ్మేవారు దీనికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. ఇంతకు ముందు నాలుగంకెలు, ఆరంకెలు గల హాల్‌మార్క్ నగలు ఉండేవి. వినియోగదారులకు ఏది మంచిదో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. ఏప్రిల్ 1నుండి ఇలాంటి గందరగోళం ఉండదు. కేవలం ఆరెంకల అల్ఫా న్యూమరిక్ హాల్ మార్కింగ్ మాత్రమే చెల్లుబాటు అవుతుందని వినియాగదారు వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలియజేసింది. ఈ మార్కు లేకుండా బంగారం విక్రయాలు సాధ్యం కావని పేర్కొన్నారు.దీనివల్ల బంగారం స్వచ్ఛత ప్రమాణాలు తెలుస్తుంది. ప్రస్తుతానికి భారత్‌లో 1338 హాల్ మార్కింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ HUID మార్క్ ఉంటే నగల వ్యాపారులు ఇక ప్రజలను మోసం చేయడానికి, నకిలీ బంగారం అమ్మడానికి అవకాశం ఉండదు.

