‘బస్సు-లారీ ఘోర యాక్సిడెంట్’..8 మంది మృతి
శుక్రవారం మధ్యాహ్నం చిత్తూరు-బెంగళూరు ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలమనేరు నియోజక వర్గం పరిధిలోని మొగిలి ఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనా స్థలంలో 8 మంది మరణించారు. ఈ ప్రమాదంలో 30 మంది వరకూ గాయపడ్డారు. పలమనేరు నుండి తిరుపతికి వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకదానికొకటి బలంగా ఢీకొట్టి మరో టెంపో పైకి దూసుకెళ్లాయి. దీనితో భారీ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.