Home Page SliderNational

రాంగ్ రూట్లో బస్సు బీభత్సం.. 6గురు దుర్మరణం

ఘజియాబాద్‌లో ఈ రోజు ఉదయం రాంగ్ రూట్లో వచ్చిన స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. యూపీలోని దిల్లీ –మేరఠ్ హైవేపై రాంగ్ రూట్‌లో వెళ్తున్న బస్సు వేగంగా వస్తున్న ఒక ఎస్వీయూ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని 6గురు అక్కడి కక్కడే మరణించారు. కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు దాదాపు 9 కిలోమీటర్లు రాంగ్ రూట్లో వచ్చినట్లు పోలీసులు తెలిపారు.ఈ బస్సు దిల్లీలోని ఘాజీపూర్ నుండి రాంగ్ రూట్లో వస్తోంది. కారు మేరఠ్ నుండి గురుగ్రామ్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన రాహుల్ విహార్ సమీపంలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు.