హైకోర్టులో బన్నీ క్వాష్ పిటిషన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో తనపై నమోదైన కేసు విషయమై ఆనయన హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టి వేయాలని అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం రేపు విచారణకు స్వీకరించే అవకాశం ఉంది.