రాజ్య సభలో 500 నోట్ల కట్టలు..
రాజ్య సభలో గందరగోళం నెలకొంది. సభలో రూ.500 నోట్ల కట్టలు లభ్యమవడం కలకలం రేపింది. కేంద్ర భద్రతా సిబ్బంది తనిఖీల్లో భాగంగా ఇవాళ ఉదయం సభలో సెక్యూరిటీ సిబ్బందికి రూ.500 నోట్ల కట్టలు లభ్యమైంది. అయితే ఆ డబ్బు ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ చైర్ వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సిబ్బంది వెల్లడించారు. అయితే ఆ డబ్బు ఎవరిదో తేల్చాలంటూ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీపై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖర్ విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే చైర్మన్ నిర్ణయాన్ని విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే తప్పుబట్టారు. విచారణ సందర్భంగా ఎంపీ పేరును ప్రతిపాదించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రస్తుతం ఇదే అంశంపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది.

