అదరగొట్టిన బుమ్రా..ఆధిక్యంలో భారత్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతం చేశారు. జస్‌ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీసి అదరగొట్టారు. దీనితో ఆస్ట్రేలియా జట్టు 104 పరుగులకే ఆలౌటయ్యింది. భారత్ టీమ్ 150 పరుగులకు ఆలౌట్ కావడంతో 46 పరుగుల ఆధిక్యతలో ఉంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఒక అరుదైన ఘనతను సాధించారు. భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్‌తో సమానంగా టెస్టుల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలపై ఏడుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన ఘనత సాధించారు. దీనితో కపిల్ దేవ్‌తో సంయుక్త రికార్డును సాధించారు.

