ఐసీసీ చీఫ్‌గా భారతీయుడు, కేంద్ర హోం మంత్రి తనయుడికి బంపర్ ఆఫర్
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక పదవి భారతీయుడ్ని వరించింది. ఈ పోస్టుకు గతంలో పలువురు భారతీయులు పనిచేసినప్పటికీ తాజాగా ఈ స్థానంలో బీసీసీఐ సెక్రటరీ జయ్ షా నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్న గ్రెగ్ బార్క్లే స్థానంలో జయ్ షా ICC ఛైర్మన్‌గా నియమితులైనట్టు తెలుస్తోంది. ఐసీసీ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కుడిగా జయ్ షా రికార్డుల్లోకెక్కారు. ప్రస్తుత ICC చీఫ్ గ్రెగ్ బార్క్లే నవంబర్ 30న తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. బార్క్లే మంగళవారం, ఆగస్టు 20 పదవికి సెలవు ప్రకటించడానికి ముందు ICC ఛైర్మన్‌గా రెండు టర్మ్‌లు పనిచేశారు. “ICC చైర్ గ్రెగ్ బార్క్లే తాను మూడోసారి నిలబడనని, నవంబర్ ప్రస్తుత పదవీకాలం ముగియగానే పదవి నుండి వైదొలుగుతానని స్పష్టం చేశారు. బార్క్లే 2020 నవంబర్‌లో స్వతంత్ర ICC చైర్మన్‌గా నియమితులయ్యారు. 2022లో తిరిగి ఎన్నికయ్యారు.