Home Page SliderNational

బాలీవుడ్ యాక్టర్ శరీరంలోకి బుల్లెట్.. తీవ్ర గాయాలు

బాలీవుడ్ స్టార్ యాక్టర్ గోవిందకు గాయాలయ్యాయి. ఈ రోజు తెల్లవారుజామున ఆయన రివాల్వర్ మిస్ ఫైర్ కావడంతో కాలికి గాయాలైనట్టు ముంబై పోలీసులు తెలిపారు. గోవింద ముంబైలోని తన నివాసం నుంచి కోల్ కత్తాకు వెళ్లేందుకు బయలుదేరే సమయంలో తన లైసెన్స్ డ్ రివాల్వర్ ను తీసుకెళ్లాలని అనుకున్నారు. రివాల్వర్ ను కప్ బోర్డు నుంచి అందుకుని బయటికి వస్తున్న సమయంలో అనుకోకుండా అది చేయి జారి కిందపడడంతో ఆ రివాల్వర్ నుంచి ఒక్కసారిగా దూసుకొచ్చిన బుల్లెట్ గోవింద కాలికి తగలడంతో గోవిందకు తీవ్ర గాయమైంది. హుటాహుటినా ముంబై లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్స్ వెంటనే గోవిందకు ఆపరేషన్ నిర్వహించి కాలి నుండి బుల్లెట్ ను తొలగించారు. ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని పర్సనల్ మేనేజర్ వెల్లడించారు. ఈ మేరకు గోవింద ఓ ఆడియో క్లిప్ విడుదల చేశారు. ‘నా తల్లిదండ్రులు, గురువు ఆశీర్వాదాలు, ఫ్యాన్స్ అభిమానాలే నన్ను కాపాడాయి. నాకు బుల్లెట్ గాయమైంది. కానీ దానిని డాక్టర్లు విజయవంతంగా తీసేశారు. అందుకు వైద్యులకు నేను థ్యాంక్స్ చెప్తున్నా’ అన్నారు. 60 ఏళ్ల గోవింద కోల్ కత్తా వెళ్లేందుకు ఇంటి నుంచి బయల్దేరే సమయంలో ఘటన జరిగింది. గోవింద భార్య సునీత అహుజా ఘటన విషయం తెలిసి కోల్ కత్తా నుంచి ముంబైకి బయల్దేరారు.