తెలంగాణా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
తెలంగాణాలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.కాగా ఈ సమావేశాల్లో రైతులకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ సభ్యులు పంచకట్టులో అసెంబ్లీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారంతా రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.నేడు ప్రారంభమైన ఈ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర బడ్జెట్‌పై అధికార,ప్రతిపక్షాల మధ్య వాడీవేడీగా చర్చ జరగనుంది.ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేపు అసెంబ్లీలో తెలంగాణా బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం కన్పిస్తోంది.అయితే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ పేర్కంది. కాగా వాటన్నింటికీ జవాబు ఇస్తామని కాంగ్రెస్ సర్కార్ ధీమా వ్యక్తం చేస్తుంది.

