Home Page SliderNational

బీఎస్ఎఫ్ దళాలు పాక్ డ్రోన్‌ను ధ్వంసం చేసాయి..

భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో పాక్‌కు చెందిన డ్రోన్‌ను భారత గగనతలంలోకి ప్రవేశించే క్రమంలో.. బీఎస్‌ఎఫ్ జవాన్ దళాలు రంగంలోకి దిగాయి. అమృత్‌సర్‌లోని రానియన్ వద్ద ఆ డ్రోన్‌ను ధ్వంసం చేసినట్లు బీఎస్‌ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ డ్రోన్‌ల ద్వారా దేశంలోకి మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని అక్రమంగా చేరవేసేందుకు స్మగ్లర్లు ఉపయోగిస్తారని చెప్పారు.