Home Page SliderNational

అక్కడ బీఎస్ 3, బీఎస్ 4 వెహికల్స్ బ్యాన్

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 406 పాయింట్లకు చేరింది. ఇప్పటికే పలు స్కూళ్లకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తుండగా, స్టూడెంట్స్ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించింది. తాజాగా కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వెహికల్స్ రాకపోకలపై బ్యాన్ విధించింది. అతిక్రమించిన వారికి మోటర్ వాహన చట్టం 1988 ప్రకారం రూ.20 వేల జరిమానా విధించనుంది. డీజిల్ తో నడిచే ఇంటర్ స్టేట్ బస్సులు, లైట్ డీజిల్ వెహికల్స్, పెట్రోల్ తో నడుస్తున్న కార్లపై మాత్రమే నిషేధం ఉంటుందని తెలిపింది. నిత్యవసర సరుకులు తరలించే వాహనాలు, సీఎన్జీ, ఎలక్ట్రిక్ బస్సులపై ఎలాంటి నిషేధం లేదు.