గంజాయి మత్తులో దారుణ హత్య
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌లో గంజాయి మత్తులో పవన్ గ్యాంగ్ హత్యకు పాల్పడింది. ఓ పార్కులో గంజాయి సేవిస్తూ గొడవ చేస్తున్న ఐదుగురిని అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్, వెంకటరమణ కలిసి నిలదీశారు. దీంతో పవన్ ఇనుప కడ్డీతో వెంకటరమణ గుండెలో పొడిచి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పవన్ అనే నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన పవన్ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.

