Home Page Sliderhome page sliderTelangana

వెంబడించి.. కత్తితో పొడిచి నడిరోడ్డుపై దారుణ హత్య

హైదరాబాద్ లోని నాంపల్లిలో నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన MNJ క్యాన్సర్ ఆసుపత్రి వద్ద జరిగింది. చాంద్రాయణ గుట్టకు చెందిన అయాన్ ఖురేషీ అనే వ్యక్తిని కత్తులతో దుండగులు నరికి చంపారు. అయాన్ ఖురేషీ ఓ కేసు నిమిత్తం నాంపల్లి కోర్టుకు వచ్చాడు. అనంతరం తిరిగి వెళ్తుండగా ఐదుగురు దుండగులు ఆయన్ను వెంబడించారు. క్యాన్సర్ ఆస్పత్రి వద్ద తొలుత బ్యాట్ తో దాడి చేశారు. అనంతరం కత్తులతో గొంతు కోసి కడుపులో పొడిచి చంపారు. హత్యకు ఉపయోగించిన బ్యాట్, కత్తులను ఘటన స్థలంలోనే వదిలి పరారయ్యారు. సమాచారం అందుకున్న నాంపల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.