లిఫ్ట్‌లో దారుణ హత్య..
హైదరాబాద్ హిమయత్ నగర్‌లో దారుణ హత్య జరిగింది. హిమయత్ నగర్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనం లిఫ్ట్‌లో ఒక వ్యక్తి హత్యకు గురికావడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ హత్యను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేశారని, హత్య జరిగిన తర్వాత బ్యాంకు లిఫ్టులో పడేసి వెళ్లిపోయారని తెలుస్తోంది. హత్యకు గురైన వ్యక్తి ఎవరో, హత్యకు గల కారణాలేమిటో పోలీసులు ఆరా తీస్తున్నారు.