Home Page SliderTelangana

ఎవరైనా సరే.. మిత్తితో సహా చెల్లిస్తాం

ఎవరైనా సరే ఎక్స్ ట్రాలు చేసినవారి పేర్లు రాసిపెట్టుకుని మిత్తితో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఏ అధికారి అయినా సరే ఎక్స్ ట్రాలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. న్యాయం, ధర్మం ప్రకారం ప్రభుత్వ అధికారులు పనిచేయాలని సూచించారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామ్ లీలా మైదానంలో నిర్వహించిన రైతన్నల ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమంగా, అన్యాయంగా రైతులపై కేసులు పెడతామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గరపడ్డాయని జోస్యం చెప్పారు. రైతు భరోసా కింద ఎకరాకు ఇస్తామన్న రూ.15 వేలు ఎక్కడ? అని ప్రశ్నించారు. అలాగే ఆడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం ఎక్కడుందని కాంగ్రెస్ సర్కార్ ను నిలదీశారు.