ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం..
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ సన్నిహితులకు బీదర్ లో దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ ఉందని.. ఎన్నికల్లో పంచినవన్ని అక్కడ ముద్రించిన దొంగనోట్లేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీల మధ్య తీవ్రమైన దుమారం రేపింది. కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఏకంగా బండి సంజయ్ పై బంజారాహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు కేంద్రమంత్రి స్థాయిలో లేవని.. సిగ్గు, లజ్జ లేకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ నిజంగానే మొగోడు అయితే, కేంద్ర మంత్రి అయితే ఆరోపణలు నిరూపించూ అని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై అసత్య ఆరోపణలు చేసిన బండి సంజయ్ పై చట్టపర చర్యలు తీసుకోవాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు.

