బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు
తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. మా వ్యక్తిగత సమాచారాలను తెలుసుకోవడానికి ప్రభుత్వం మా పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మీడియా సమావేశంలో ఆరోపించారు. ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని, కరీంనగర్ సీపీ ఫోన్ కూడా ట్యాపింగ్‌కు గురయ్యిందన్నారు. దీనిపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదన్నారు. రుణమాఫీ కేవలం 40 శాతం మందికే అయ్యిందని, ప్రభుత్వ నిధులేం కాంగ్రెస్ పార్టీవి కాదని పేర్కొన్నారు. ఓడిన ఎమ్మెల్యేకు చెక్కులు పంచే హక్కు ఎవరిచ్చారని, ఈ అంశంపై హైకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగులపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

