బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో సోదాలు నిర్వహించిన: ఈడీ
తెలంగాణ: పటాన్‌చెరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధూసూదన్ రెడ్డి ఇళ్లల్లో సోదాలకు సంబంధించి ఈడీ అధికారిక ప్రకటన చేసింది. సంతోష్ శాండ్, సంతోష్ గ్రానైట్ కంపెనీల ద్వారా మొత్తం రూ.300 కోట్ల మైనింగ్ అక్రమాలు జరిగినట్లు గుర్తించింది. ప్రభుత్వానికి రూ.39 కోట్లు నష్టం చేకూర్చారని తెలిపింది. డబ్బును స్థిరాస్తి రంగంలో పెట్టుబడుల కింద పెట్టారని, పలువురిని బినామీలుగా చేర్చినట్లు తేలిందని ఈడీ వివరించింది.


 
							 
							