మాటకు మాట వడ్డిస్తున్న బీ.ఆర్.ఎస్.
కార్యకర్తల మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డిని శుక్రవారం కేసిఆర్ విమర్శించిన గంటల వ్యవధిలోనే రేవంత్ రెడ్డి స్పందిస్తూ కలబడుడు…కొట్టాడుడు కాదు….ముందర కట్టెలేకుండా నడుచుడు నేర్చుకో అని రేవంత్ రెడ్డి కేసిఆర్‌ని ఎద్దేవా చేయడంతో ఆయనపై బీ.ఆర్.ఎస్.శ్రేణులు ప్రతిస్పందన విమర్శలు చేస్తున్నారు.శనివారం కేటిఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ” కేసీఆర్ కట్టె లేకుండా నడుసుడు కాదు.. నీకు చేతనైతే కమిషన్లు లేకుండా ప్రభుత్వాన్ని నడుపు …కేసీఆర్ దెబ్బ ఎట్లా ఉంటదో నీ పాత గురువును అడుగు.. మీ రాహుల్ గాంధీ వాళ్ళ అమ్మను అడుగు ” అంటూ ఘాటుగా ప్రతిస్పందించారు.దీంతో కేటిఆర్ రంగంలోకి దిగడంతో ఆ ఆ పార్టీకి మాజీ మంత్రులు సైతం ఈ విషయంపై రేవంత్ రెడ్డిని మాటలతో తూర్పారబడుతున్నారు.