సంకెళ్లతో బీఆర్‌ఎస్ వినూత్న నిరసన..
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్‌ఎస్ పార్టీ వినూత్న నిరసనకు దిగింది. చేతులకు సంకెళ్లు, నల్లని దుస్తులు ధరించి సభకు హాజరయ్యారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు. లగచర్ల రైతులకు బేడీలు వేసిన ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ వారు ఇలా ప్రవర్తించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ఆందోళనలు చేశారు. రైతుల బలవంతపు భూసేకరణపై బీఆర్‌ఎస్ వాయిదా తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించే అవకాశం ఉంది. ప్రభుత్వం మరోవైపు టూరిజం పాలసీపై చర్చలు జరగాలని ప్రతిపాదించింది. మరోవైపు బీఆర్‌ఎస్ పార్టీ లగచర్ల రైతుల అరెస్టుల విషయంపై చర్చ జరగాలని కోరుతోంది. యంగ్ ఇండియా బిల్లు, యూనివర్సిటీ సవరణ బిల్లులపై నేడు చర్చలు ఉంటాయని స్పీకర్ పేర్కొన్నారు.