ధరణి పోర్టల్ ద్వారా బీఆర్‌ఎస్ దోపిడీ..భట్టి
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అడ్డు పెట్టుకుని నేతలు వేల ఎకరాల భూమిని దోపిడీ చేశారని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ ఆ వివరాలన్నీ బయటకు తీస్తామని పేర్కొన్నారు. హైడ్రా, మూసీ నది పునరుజ్జీవనం విషయంలో ప్రభుత్వం బాగా ఆలోచించే ముందుకు కొనసాగుతోందన్నారు. మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకోవడానికి రుణ సదుపాయం కల్పిస్తామని పేర్కొన్నారు.

