Home Page SliderTelangana

బీఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్, ఒకే గూటి పక్షులన్న కిషన్ రెడ్డి

బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతుల గోసను తెలియజేసి, బీజేపీ తరపున ఓ విశ్వాసాన్ని, భరోసాని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రజాకార్ల ఆధ్వర్యంలో ఏ రకంగా హిందువులను ఊచకోత కోశారో తెలుసన్న కిషన్ రెడ్డి… ప్రస్తుత ప్రభుత్వం వారి వారసత్వాన్ని కొనసాగిస్తోందన్నారు. ఖమ్మం పట్టణంలో జరిగిన రైతు గోస బీజేపీ భరోసా, సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. అభినవ సర్దార్ పటేల్.. శ్రీ అమిత్ షా చొరవతో సెప్టెంబర్ 17నాడు గతేడాది మొదటిసారి అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు జరుపుకున్నామన్నారు. తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.

తెలంగాణలో, బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో వ్యవసాయం దండుగ అన్నట్లు మారిందన్నారు. రైతన్నలు అన్నిరకాలుగా దగా పడుతున్నారన్నారు. రైతులకు బీమా దీమా లేదని, సరైన సబ్సిడీల్లేవన్నారు. వ్యవసాయ రుణాలమీద పావలా వడ్డీలేదన్నారు. అన్ని సమస్యలకు రైతుబంధు ఒక్కటే పరిష్కారం కాదన్నారు. రైతాంగంలో 75 శాతం కౌలు రైతుల చేతుల్లోనే ఉందన్నారు. ఇవాళ తెలంగాణను సీడ్ బౌల్ చేస్తామని చెప్పి.. కేసీఆర్ ఫ్యామిలీకి గోల్డెన్ బౌల్ గా మార్చుకున్నారు. తెలంగాణలో రైతాంగానికి సంబంధించిన ఏ సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఉచిత ఎరువులు ఇస్తామని ఉత్తరకుమార ప్రగల్భాలు పలికాడన్నారు. ఐదేండ్లు కావొస్తున్నా ఉచిత ఎరువులు ఎందుకు ఇవ్వడం లేదని కేసీఆర్ ను ప్రశ్నించారు కిషన్ రెడ్డి.

రైతు రుణమాఫి నాలుగున్నరేండ్లు మరిచిపోయి.. ఎన్నికల ముందు తూతూ మంత్రంగా అమలు చేయాలన్న నాటకాలు చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి రాగానే.. రైతు సమస్యలను పరిష్కరించే దిశగా మేం పూర్తిస్థాయిలో రైతుల పక్షాల నిలబడి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూయిస్తామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి అధికారాన్ని అందించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సోనియా కుటుంబం కోసం పనిచేస్తే.. బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కుటుంబం కోసం పనిచేస్తోందన్నారు. ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీకి స్వాగతించాలన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ, మజ్లిస్ ఒకే గూటి పక్షులన్నారు కిషన్ రెడ్డి. ఈ పార్టీలకు ఓటేస్తే నిరుపయోగమవుతాయన్నారు. తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల సాధన చేసేది బీజేపీ మాత్రమేనన్నారు. బీజేపీ మాత్రమే మోదీ నాయత్వంలో సుస్థిరమైన అభివృద్ధికి బాటలు వేస్తోందన్నారు.