BJP మ్యానిఫెస్టోతో BRS, కాంగ్రెస్‌లకు గుండెల్లో దడ
నిజామాబాద్: బీజేపీ మ్యానిఫెస్టో విడుదల చేసిన తర్వాత బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు వణుకుపుట్టిందని నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని 6వ డివిజన్ వినాయక్‌నగర్‌లో హనుమాన్ జంక్షన్ నుండి ఇంటింటికీ ప్రచారం చేసి తమ ఓటు బీజేపీకి వేయమని అడిగారు. పసుపుబోర్డు ప్రకటన, అయోధ్య రామమందిర నిర్మాణం, డిగ్రీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు, వృద్ధులకు ఉచిత కాశీ, అయోధ్య రామమందిర దర్శన యాత్ర, పుట్టిన ఆడపిల్లలకు రూ.2 లక్షల డిపాజిట్, ఉజ్వల యోజన వారికి ఉచితంగా నాలుగు సిలిండర్లు వంటి అనేక అంశాలను మ్యానిఫెస్టోలో చూసి పేదలకు బీజేపీపై నమ్మకం ఏర్పడిందన్నారు. ఒక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తున్నామన్నారు ధన్‌పాల్, బీజేపీ అభ్యర్థి.