Home Page SliderTelangana

రేపు సిద్ధిపేటలో బీఆర్ఎస్ ఆశీర్వాద సభ

తెలంగాణాలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాజకీయ పార్టీలన్ని భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ జోరుగా ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతి రోజు బహిరంగ సభలు నిర్వహిస్తుంది.ఈ మేరకు ఈ రోజు భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాద నిర్వహించారు. ఈ సభకి సీఎం కేసీఆర్ హాజరయ్యారు.అయితే రేపు సిద్ధిపేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశీర్వాద సభ జరగనున్నట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. కాగా లక్షమందితో ఈ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే తెలంగాణా రాష్ట్రంలో అభ్యర్థులను ప్రకటించడంలో బీఆర్ఎస్ పార్టీనే ముందు ఉందన్నారు. కాగా రేపు 20 వేలమందితో సిద్ధిపేటలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ పార్టీ  మేనిఫెస్టో కాపీ కొట్టింది అని ఆరోపిస్తున్నారు. అయితే మేనిఫెస్టో కాపీ కొట్టింది  మేము కాదు మీరే అని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు.