కీలకనేతకు బీఆర్‌ఎస్ ఏపీ బాధ్యతలు… త్వరలో అమరావతిలో భారీ బహిరంగ సభ
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో పార్టీ జెండా ఆవిష్కరించి బీఆర్‌ఎస్ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, యూపీ మాజీ సీఎంలు కుమారస్వామి, అఖిలేష్ యాదవ్, భారీ ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా క్రమంగా వివిధ రాష్ట్రాల్లోకి బీఆర్‌ఎస్ పార్టీని విస్తరించాలనే యోచనలో ఉన్నారు. ఏపీలో సైతం సత్తా చాటాలని పట్టుదలతో ఉన్నారు. బీఆర్‌ఎస్ ఏపీ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించినట్టు సమాచారం. ఈ క్రమంలో అమరావతిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగ సభ బాధ్యతలను కూడా మంత్రి తలసానికి కేసీఆర్ అప్పగించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో తొలుత పోటీ చేయాలనే కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. తొలి దశలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో పోటీ చేయాలని భావిస్తున్నారు.


