లేడి కానిస్టేబుల్‌ని బైక్‌తో ఢీ కొట్టిన బీఆర్‌ఎస్ కార్యకర్త
విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్ ను బీఆర్‌ఎస్ కార్యకర్త బైక్‌తో ఢీ కొట్టాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగిందంటే.. కరీంనగర్ జిల్లాలో ఈ రోజు కేటీఆర్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా V కన్వేన్షన్ గేటు దగ్గర లేడి కానిస్టేబుల్ పద్మజ బందోబస్తు విధులు నిర్వహిస్తుంది. అంతలోనే బుల్లెట్ బైక్ పై అతి వేగంగా వచ్చి పద్మజను ఢీకొట్టాడు. దీంతో ఆమె క్రింద పడిపోయింది. కానిస్టేబుల్ పద్మజకు కాలికి గట్టి దెబ్బ తగిలింది. దీంతో ఆమె నడవలేని స్థితిలో ఉండడంతో మరొ పోలీస్ కానిస్టేబుల్ సహాయంతో వాహనంలో చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు.