NewsTelangana

బ్రోకర్‌ గాళ్లు వందల కోట్లతో మన ఎమ్మెల్యేల్ని కొనేందుకు వచ్చారు

మన అభివృద్ధికి డబ్బులు ఇవ్వమంటే చేతకాని వాళ్లు.. వందల కోట్లతో బ్రోకర్‌ గాళ్లను పంపి మన ఎమ్మెల్యేలను కొనడానికి వచ్చారని సీఎం కేసీఆర్ విమర్శించారు. చండూరు సభలో ఆయన ప్రసంగిస్తూ.. ‘ఇవ్వాల నాతో పాటు, మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌ నుంచి వచ్చిండ్రు. నిన్న మొన్న ఢిల్లీ బ్రోకర్‌ గాళ్లు రూ.100 కోట్లు ఇస్తామని చెబితే వాళ్లను ఎడమ కాలితో కొట్టి.. మేం తెలంగాణ బిడ్డలం.. అమ్ముడు పోం.. అని వాళ్లకు ముఖంపైనే చెప్పారు. మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, దళిత బిడ్డ, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే, గిరిజన బిడ్డ రేగ కాంతారావు.. ఇటువంటి వాళ్లు కావాలి మన రాజకీయాల్లో. దేశ గౌరవాన్ని, జాతి గౌరవాన్ని నిలిపిన వాళ్లు.. వందల కోట్ల రూపాయలు తిరస్కరించిన ఈ నలుగురికి గట్టిగా స్వాగతం పలకాలి’ అని మునుగోడు ప్రజలను కేసీఆర్‌ కోరారు.