బ్రిటన్ పరువు గంగలో కలిపింది…
UK ప్రధానమంత్రి పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో, బ్రిటన్‌కు ఇంతటి అవమానకరమైన విషయం మరోటి ఉండదంది రష్యా. బ్రిటన్‌కు ప్రధానిగా ఇంతటి అవమానం ఎన్నడూ జరగలేదని… రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మరియా జఖరోవా టెలిగ్రామ్‌లో తెలిపారు. సాలిస్‌బరీలో 2018లో రష్యా మాజీ గూఢచారిపై విషప్రయోగం చేయడంతో రష్యా, ఇంగ్లాండ్ మధ్య సంబంధాలు కొన్నేళ్లుగా క్షీణించాయి. ఉక్రెయిన్‌లో మాస్కో దాడి చేసినప్పటి నుండి భారీగా పతనమయ్యాయి. ఉక్రెయిన్ దుండుకు చర్యలకు బ్రిటన్ కారణమని రష్యా భావిస్తుంది. సెప్టెంబరులో లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా బోరిస్ జాన్సన్ స్థానంలో వచ్చిన ఒక రోజు తర్వాత, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బ్రిటన్ తన నాయకులను ఎన్నుకునే విధానంపై వ్యాఖ్యానించారు. బ్రిటన్ వ్యవస్థ… ప్రజాస్వామ్యానికి దూరంగా జరిగిందన్నారు.

దేశం మొత్తం కాకుండా ఆమె కన్జర్వేటివ్ పార్టీ సభ్యులచే నాయకత్వ బ్యాలెట్‌లో ఆమెను ఎన్నుకున్నారనే వాస్తవాన్ని అధ్యక్షుడు పుతిన్ ప్రస్తావించారు. గ్రేట్ బ్రిటన్ ప్రజలు ఈ సందర్భంలో, ప్రభుత్వ మార్పులో పాల్గొనకపోవడం దారుణమన్నారు. ఇలాంటి వ్యవస్థ ఎక్కడా ఉండబోదన్నారు. రష్యాతో సంబంధాలతో సహా ఈ ప్రశ్నలపై కన్సర్వేటివ్ టోరీల స్థానం, రష్యన్ ఫెడరేషన్‌తో సంబంధాలను ఎలా పెంచుకోవడం, రక్షించుకోవడం తెలుసన్నారు. ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొదటి అంతర్జాతీయ పర్యటనలో, లిజ్ ట్రస్ 2002లో ఉక్రెయిన్‌పై వెచ్చించిన 2.3 బిలియన్ పౌండ్ల ($2.6 బిలియన్) సైనిక సహాయాన్ని వచ్చే ఏడాదికి మరింతగా పెంచుతామంటూ ఐక్యరాజ్యసమితిలో ఆమె వాగ్దానం చేసింది. వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌కు దళాలను పంపడానికి రెండు వారాల ముందు, ఫిబ్రవరిలో విదేశాంగ మంత్రిగా ట్రస్ రష్యాను సందర్శించారు.

