ఢిల్లీ కొకైన్ వ్యవహారంలో బ్రిటన్, దుబాయ్ లింకులు
ఢిల్లీలో ఇటీవల 500కేజీల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. దీని ఖరీదు రూ.5 వేల కోట్లుండవచ్చని అంచనాలు వేస్తున్నారు. అయితే ఈ కేసులో కీలక ఆధారాలను సేకరించారు పోలీసులు. స్పెషల్ సెల్ పోలీసులు పంజాబ్‌లోని అమృతసర్‌లో కీలక నిందితుడు జితేంద్ర పాల్ సింగ్ అలియాస్ జెస్సీని అరెస్టు చేశారు. అతడు అక్కడి నుండి బ్రిటన్‌కు వెళ్లాలని ప్లాన్ చేసిన సంగతి తెలుసుకున్నారు. బ్రిటన్‌లో 17 ఏళ్లుగా ఉంటున్నాడని తనిఖీలలో గుర్తించారు. ఇతడికి దుబాయ్‌లోని మాస్టర్ మైండ్ వీరేంద్ర బసొయాతో కూడా సంబంధాలున్నట్లు సమాచారం. ఇదంతా పెద్ద ముఠా అని, అంతర్జాతీయ డ్రగ్ సిండికేట్‌తో కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తేలింది. దుబాయ్ నుండి వచ్చే ప్రతీ కొకైన్ కన్‌సైన్‌మెంటుకు రూ.3కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.